మెగా అభిమానులకు గుడ్ న్యూస్..ఆచార్య రిలీజ్ కన్ఫర్మ్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్..ఆచార్య రిలీజ్ కన్ఫర్మ్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాస్టార్ మూవీ ఆచార్య రిలీజ్ డేట్ ను  ప్రకటించింది చిత్ర యూనిట్. కరోనా ఎఫెక్ట్ తో ఫిబ్రవరి 2 న రిలీజ్ కావాల్సిన ఆచార్యను నిన్న(శనివారం) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయితే ఇదే రోజున మహేశ్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని పరిస్థితుల్లో మూవీని ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మెగాస్టార, సూపర్ స్టార్ సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. మరి కరోనా పరిస్థితుల నేపథ్యంలో అప్పటి వరకు సినిమాలు రిలీజ్ అవుతాయా? మరోసారి వాయిదా పడతాయా అనేది చూడాలి.