Chiranjeevi: మరోసారి గొప్పమనసు చాటుకున్న మెగాస్టార్.. సీనియర్ జర్నలిస్టుకు ఫ్రీగా ఆపరేషన్

Chiranjeevi: మరోసారి గొప్పమనసు చాటుకున్న మెగాస్టార్.. సీనియర్ జర్నలిస్టుకు ఫ్రీగా ఆపరేషన్

కేవలం వెండి తెరపై హీరోగానే కాదు.. సేవాకార్యక్రమాలతో కూడా కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు మెగాస్టార్. ఇప్పుడు తాజాగా మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు చిరు. 

ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్టు ప్రభు ఇటీవల మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు తెలిసింది. ఆయన వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని సూచించారట. ఈ విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవిని సంప్రదించగా.. ఆయన స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట. బైపాస్ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి ప్రాబ్లెమ్ క్లియర్ చేసారట డాక్టర్స్. హాస్పిటల్ బిల్ కూడా ప్రభుని కట్టనివ్వకుండా.. చిరునే అన్నీ సెటిల్ చేశారట. ఇదే విషయాన్ని స్వయంగా జర్నలిస్ట్ ప్రభు ఆడియన్స్ తో పంచుకున్నారు. ఈ విషయంలో చిరంజీవికి రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు ప్రభు. ఈ న్యూస్ తెలుసుకున్న మిగతా జర్నలిస్టులు, నెటిజన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.