అందుకే రాజకీయాల నుంచి బయటకు వచ్చా: చిరంజీవి

అందుకే రాజకీయాల నుంచి బయటకు వచ్చా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వ్యక్తిగత విమర్శలు ఉండకూదన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతోనే నడుస్తోన్నాయన్న చిరు ..   వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చానన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహితలకు సన్మాన కార్యక్రమంలో చిరు ఈ కామెంట్స్ చేశారు.

 పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం, ఉత్సాహం పద్మవిభూషన్ వచ్చినప్పుడు లేదని తెలిపారు. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వారిలో వెంకయ్య నాయుడు ఒకరని అందుకే ఆయకు పెద్ద అభిమానిని అని చిరు కొనియాడారు. కళను గుర్తించి అవార్డులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి,  ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. 

కాగా గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి ప్రజాస్వామం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చిరు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. యూపీఎ--2 ప్రభుత్వ హయాంలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా చిరు సేవలందించారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రాజకీయాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.