నేను..మీ బ్రహ్మానందమ్..బ్రహ్మి ఆత్మకథని లాంచ్ చేసిన మెగాస్టార్

నేను..మీ బ్రహ్మానందమ్..బ్రహ్మి ఆత్మకథని లాంచ్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)..బ్రహ్మానందం (Brahmanandam) కలయిక గురుంచి ప్రత్యేకంగా ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుందేమో! చాలా స్టేజీలపైనా వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఆత్మీయతను..సినిమాల విశేషాలను పంచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

నిజానికి బ్రహ్మిని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చిందే చిరు అని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. తనదైన కామెడీతో బ్రహ్మీ 1000 కి పైగా సినిమాల్లో నటించి..తెలుగువాళ్ళకు సుపరిచితమైన హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు..గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సృష్టించి..ది గ్రేట్ అనిపించుకున్నారు.

లేటెస్ట్గా బ్రహ్మానందం తన జీవితానుభవాలను రంగరించి ఒక ఆత్మకథగా ‘నేను..మీ బ్రహ్మానందమ్’ (Nenu Me Brahmanandam)అనే పుస్తకరూపంలో అందరీ ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పుస్తకంలో 'ఆయన కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, తనకెదురైన ఎన్నోజీవిత గమనాలను అందరి ముందుకు తీసుకు వస్తున్నారు.

ఆ బుక్ కవర్ పేజీలోనే బ్రహ్మి ఇలా చెప్పుకొచ్చారు..ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావొచ్చు, మార్గదర్శకం కావొచ్చు అని రాశారు. . ఇక ఈ బుక్ ని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం ఆనందం అని తెలిపారు.

ఇక చిరు లేటెస్ట్ గా బ్రహ్మానందం ఆత్మకథ పై స్పందిస్తూ..నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో..తానే చెప్పినట్టు 'ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే  ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని శుభాకాంక్షలు తెలియజేశారు.

నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా
తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో
తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన
ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023

 

ఈ బుక్ని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఆ బుక్ అమెజాన్ లింక్ ని చిరంజీవి కూడా షేర్ చేశారు. మీరు కూడా బ్రహ్మానందం