కరోనాపై స్పందించిన మెగాస్టార్

కరోనాపై స్పందించిన మెగాస్టార్

కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. కరోనాకు మందు లేకపోవడంతో.. దాని నివారణే మార్గమని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా పలువురు ప్రముఖులు, సినీనటులు కూడా తమ వంతు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హీరో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తమ బాధ్యతగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ వీడియోలు విడుదల చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు ప్రజల ఆరోగ్యం కోసం తన వంతు బాధ్యతగా కరోనా గురించి ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ‘యావత్తు ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేం కాదనే నిర్లక్ష్యం కానీ ఈ రెండు పనికిరావు. జాగ్రత్తగా ఉండి, ధైర్యంగా ఎదుర్కొవలసిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉదృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. కరోనా ప్రమాదకారి కాకపోయినా.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితే రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్‌ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం.. నమస్తే..’ అని కోరారు.

For More News..

వైరలవుతున్న సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్.. ఫాలోవుతున్న సెలబ్రెటీలు

ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్