అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

నటుడిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం అల్లురామలింగయ్యే అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య  వల్ల ఎంతో మందికి ఉపాధి లభించిందని చెప్పారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నార్సింగిలో అల్లు స్టూడియోను చిరంజీవి ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో  చిరంజీవి కుటుంబ సభ్యులు, అల్లూ అరవింద్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

రామలింగయ్య బాటలో నడుస్తున్నాం..
అల్లు రామలింగయ్య  శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. - రామ లింగయ్య వేసిన అడుగులో తాము అందరం నడుస్తున్నామని చెప్పారు.  ఈ స్టూడియో లాభాపేక్షకోసం కాకుండా... అల్లూ రామలింగయ్య కృతజ్ఞత కోసమే స్థాపించారని భావిస్తున్నట్లు చెప్పారు.

తాత జ్ఞాపకంగా స్టూడియో నిర్మాణం


అల్లు స్టూడియోను కమర్షియల్గా వర్క్ అవుట్ చేసుకోవడానికి పెట్టలేదని నటుడు అల్లు అర్జున్ తెలిపారు. తాత అల్లు రామలింగయ్య  జ్ఞాపకంగా మాత్రమే ఈ స్టూడియోని నిర్మించామన్నారు. ఎవరి ఇంట్లో అయినా వాళ్ళ నాన్న చనిపోతే కాలం గడిచినాకొద్ది మెల్లిమెల్లిగా మర్చిపోతుంటారని..కానీ నాన్న అల్లు అరవింద్  మాత్రం...ప్రతిఏటా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ఎవరిని కించపర్చడానికి మాట్లాడట్లేదన్నారు. అది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి బట్టి ఉంటుందన్నారు. 

10 ఎకరాల్లో స్టూడియో..


నార్సింగిలో  10 ఎకరాల్లో అల్లు  స్టూడియో నిర్మించారు. గతేడాది స్టూడియో నిర్మాణం మొదలు పెట్టగా.. నిర్మాణం పూర్తవ్వడంతో స్డూడియోస్‌ను ఘనంగా ప్రారంభించారు.  అత్యాధునిక టెక్నాలజీతో, అన్ని సదుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టూడియోలో పుష్ప2  సినిమా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.