యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. సంచలన విషయాలు వెల్లడించిన యూవీ

యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. సంచలన విషయాలు వెల్లడించిన యూవీ

యువరాజ్ సింగ్ అంటే ఆరు బాళ్లలో ఆరు సిక్సులు.. ఇండియాకు 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాలు. లెఫ్ట్ హ్యాండ్ బాటర్ గా వచ్చి.. ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేసిన యూవీ.. తన రిటైర్మెంట్ పై సంచలన విషయాలు వెల్లడించాడు. ఎందుకు రిటైర్ అవ్వాల్సి వచ్చిందో రీసెంట్ గా సానియా మీర్జాతో చేసిన పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ క్రికెట్ సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. 

ఫామ్ లో లేకపోవటమో.. ఏదైనా సీరీస్ లో పూర్ పర్ఫామెన్స్ కారణంగానో రిటైర్మెంట్ ప్రకటించలేదని అన్నాడు యూవీ. 2012 లో క్యాన్సర్ తో పోరాడిన తర్వాత.. మళ్లీ టీమిండియా కోసం ఎంతో శ్రమించి పాత ఫామ్ ను కొనసాగించి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్లు చెప్పిన యూవీ.. రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం.. గౌరవం, ప్రోత్సాహం లేకపోవడమేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన చుట్టూ అలాంటి వాతావరణం లేకపోవడమే ముఖ్యమైన కారణమని అన్నాడు. 

గేమ్ ఎంజాయ్ చేయలేకపోయా:

ఆ సమయంలో నేను గేమ్ ను ఎంజాయ్ చేయలేకపోయా.. ఎంజాయ్ చేయలేనప్పుడు ఎందుకు ఆడాలని నాకు నేను ప్రశ్నించుకున్నా. నాచుట్టూ ఉన్న వాతావరణం నాకు మద్ధతుగా ఉన్నట్లు కనిపించలేదు. నాకు గౌరవం ఇస్తున్నట్లు కనిపించలేదు. ఇవేవీ లేకుండా నేని చోట నేను ఉందుకుండాలి.. ఎందుకు ఆడాలి.. నేను ఇంకా ఏం నిరూపించుకోవాలి..ఇంతకంటే ఇంకేం చేయాలి..? ఇది నన్ను చాలా బాధించింది. ఆరోజే డిసైడయ్యా.. నేను ఇక్కడ ఉండకూడదు.. అంటూ రిటైర్మెంట్ వెనుక తన అంతరంగంలో ఉన్న బరువును పంచుకున్నాడు యూవీ. 

రిటైర్మెంట్కు ముందు యూవీ ఆడిన లాస్ట్ సీరీస్ 2017లో వెస్టిండీస్ తో వన్డే సిరీస్. దానికంటే ముందు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ఆడాడు. చివరి టెస్టు 2012లో ఆడిందే. 2011లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం ఏడాది పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు యువీ. 2012లో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ.. ఫామ్ లేమితో 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2015 లో వన్డే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్ కు దూరమయ్యాడు. 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమికి కూడా యువీ విమర్శలు ఎదుర్కొన్నాడు. 

మ్యాచ్ విన్నర్:

2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి వ్యక్తి యువరాజ్. సూపర్ 8,సెమీస్‌లో అద్భుత ఇన్నింగ్స్ తో ఇండియా తొలి ఎడిషన్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2011 వరల్డ్ కప్ లో యువీ కంట్రిబ్యూషన్.. కప్ ను గెలిచేలా చేసింది. 362 రన్స్, 15 వికెట్లు మెన్ ఇన్ బ్లూ రెండవ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు విజయాలు ఎంఎస్ ధోని హయాంలో టీమిండియాకు సొంతమయ్యాయి.

2004 నుంచి 2011 వరకు అద్భుత ఫామ్ తో..  ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే ఫినిషర్ గా యువరాజ్ సింగ్ టీమిండియాకు సేవలందించాడు.

యువరాజ్ సింగ్ వన్డే గణాంకాలు:

యువీ గురించి తెలియాలంటే అతని గణాంకాల గురించి తెలుసుకోవాలి. 304 వన్డే మ్యాచ్‌లు ఆడి 278 మ్యాచ్‌ల్లో 40 నాటౌట్‌లతో బ్యాటింగ్ చేశాడు. 36.55 సగటుతో 8 వేల 701 రన్స్ చేశాడు. యూవీ బెస్ట్  స్కోరు 150 రన్స్. 14 సెంచరీలు (100),  52 హాస్ సెంచరీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువరాజ్ 94 క్యాచ్‌లతో పాటు 5/31 బెస్ట్‌తో 111 వికెట్లు కూడా తీశాడు.