దర్శకులకు మెగాస్టార్ కీలక సూచనలు

దర్శకులకు మెగాస్టార్ కీలక సూచనలు

టాలీవుడ్ దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని..పేపర్ వర్క్ లోనే అన్ని పూర్తి చేయాలని ఆయన దర్శకుల సూచించారు. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ సక్సెస్ మీట్ లో చిరు మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

హిట్ సినిమా తీశాం,మంచి కథ చెప్పాం, హిట్ కొట్టామంటే కుదరదని..సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలని చిరు పేర్కొన్నారు. నిర్మాతలు బాగుండాలి, వాళ్లు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చెప్పారు. సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పక్కర్లేదని..మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే మనకు థాంక్స్ చెబుతున్నారని చిరు తెలిపారు.