
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న నాటునాటు పాటపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆస్కార్ అనేది ఇప్పటివరకు ఇండియాకు కలగా ఉండేది.. కానీ రాజమౌళి తన విజన్, దైర్యంతో దాన్ని సుసాద్యం చేశాడు. వందల కోట్ల భారత గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. నాటునాటు పాట ప్రపంచ అగ్రస్థానన నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ అంటూ చిరు పోస్ట్ చేశారు.
నాటు నాటు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి మ్యూజిక్ అందించారు. సింగర్స్ కాలబైరవ, రాహుల్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డ్యాన్స్ తో పాటను ఇంకో లెవల్ కు తీసుకెళ్లారు. వీరందరి ప్రతిభతో పాటుగా రాజమూళి డైరక్షన్ పాటను ఆస్కార్ అందుకునేలా చేసింది. దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.