
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం రావడంతో దేశం మొత్తం గర్విస్తూ..సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
చంద్రుడ్నిచేరటానికి భారత సైంటిస్టులు పడిన కష్టం సక్సెస్ అయింది. దేశమంతటా జయహో ఇండియా అంటుందని..చంద్రయాన్ 3 చంద్రుడిని ముద్దాడుతూ.సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది ఇస్రో చేసి చూపించింది.
చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ముద్దాడింది. చంద్రుడిపై ఇండియా జెండా ఎగిరింది అంటూ తెలిపారు. అలాగే భారతదేశం సాధించాల్సిన ముఖ్యమైన విజయం ఇదంటూ..అపూర్వమైన, అద్భుతమైన విజయం సాధించడంతో..ఇండియా చరిత్ర సృష్టించింది.
అలాగే రాబోయే కాలంలో మరిన్ని విజయాలను సాధించడానికి సైంటిస్టులు ఒక చక్కటి మార్గం వేశారంటూ..చిరంజీవి భారత జెండాతో ట్వీట్ చేశారు.
An absolutely Momentous achievement for India !! #Chandrayaan3 ? registers an unprecedented and spectacular success!!! ???
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2023
History is Made today!! ???
I join over a Billion proud Indians in celebrating and congratulating our Indian scientific community !!
This clearly… pic.twitter.com/tALCJWM0HU