పూనకాలు లోడింగ్.. చిన్నారి డ్యాన్స్‭కు మెగాస్టార్ ఫిదా

పూనకాలు లోడింగ్.. చిన్నారి డ్యాన్స్‭కు మెగాస్టార్ ఫిదా

మెగాస్టార్ చిరు నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‭ను షేక్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. చిరును మాస్ లుక్‭లో చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా చూస్తూ ఓ చిన్నారి చేసిన హంగామా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. థియేటర్‭లో స్క్రీన్ పై పూనకాలు లోడింగ్ సాంగ్ చూసిన ఆ చిన్నారి స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోను చూసిన మెగాస్టార్.. చిన్నారిని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ డ్యాన్స్ చేసిన వీడియో ట్వీట్ చేస్తూ.. తర్వాతి జనరేషన్‭లోనూ పూనకాలు కంటిన్యూ అవుతున్నాయని క్యాప్షన్ పెట్టారు. 

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్‌ని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. చిరు డ్యాన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు తోడు.. కామెడీ జత కావడంతో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‭గా దూసుకెళ్తోంది. దీంతో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఇదే బెస్ట్‌ అంటూ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రిలీజైన మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజూ హవా కొనసాగించింది. ఇక రెండో రోజు నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.