భోళా మ్యానియా షురూ.. ఫస్ట్ సింగల్ ప్రోమో అదిరింది

భోళా మ్యానియా షురూ.. ఫస్ట్ సింగల్ ప్రోమో అదిరింది

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’(Bhola shankar). మెహర్ రమేష్(Meher ramesh)  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి అదిరిపోయే క్రేజీ ఉప్దేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక సాంగ్ ప్రోమో చాలా బాగుంది. మహతి స్వర సాగర్(Mahati swara sagar) ఇచ్చిన మ్యూజిక్ బిట్ ట్రెండీగా ఉంది. వినగానే హైప్ ఎక్కించేలా ఉంది ఈ ట్యూన్. ఇక ఫుల్ లిరికల్ సంగ్ ను జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక వాల్తేరు వీరయ్య(valteru veerayya) వంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగా స్టార్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 

తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం(Vedalam remake) సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannah) నటిస్తుండగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్(Keerthi suresh) కనిపించనుంది. హీరో సుశాంత్(Sushanth) కూడా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర(Ramabrahmam sunkara) నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=FTFxvrXY6IA