ఈ సినిమా చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది

ఈ సినిమా చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది
కరోనాతో దాదాపు ఆరునెలలుగా సినిమాహాళ్లన్నీ మూతపడ్డాయి. కరోనా తీవ్రత తగ్గడం, ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో సినిమా థియేటర్లు రీ ఓపెనింగ్‌కి సిద్ధమవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘సోలో బతుకే సో బెటర్’సినిమా కిస్మస్ సందర్భంగా విడుదలకు రెడీ అయింది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా నిలవనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం విడుదల ఫిల్మ్ ఇండస్ట్రీకే స్పూర్తి నింపేలా ఉంటుందని ఆయన అన్నారు. మాస్కులు ధరించి.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. థియేటర్‌లో చూసి ఆనందించాల్సిందిగా ఆయన ప్రేక్షకులను కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘ఈ క్రిస్మస్‌కి విడుదలవుతున్న ‘సోలో బతుకే సో బెటర్’ #SBSB టీం అందరికీ నా శుభాకాంక్షలు. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిల్మా ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. #StaySafe #SBSBonDec25th’ అని చిరూ ట్వీట్ చేశారు. #StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020 For More News.. అప్పు ఎగ్గొట్టడానికి.. ఒకరిని చంపి తానే చచ్చినట్లు నమ్మించిన ఘనుడు ‘సూపర్-స్ప్రెడర్’గా మారిన కొత్త వైరస్ లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ మర్డర్ ప్లాన్.. నిలిచిన రెండు ప్రాణాలు