కరువు భత్యం ప్రకటించండి : యూటీఎఫ్ 

కరువు భత్యం ప్రకటించండి : యూటీఎఫ్ 

ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారిని తెలంగాణ రాష్ట్రం UTF కమిటీ సభ్యులు కోరారు. బకాయి ఉన్న మూడు వాయిదాల కరువు భత్యాన్ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లుల నిధులను ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, బ్లాక్ చేసిన 13 జిల్లాల దంపతుల బదిలీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 

బీసీ గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని కోరారు. మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, ఎయిడెడ్, కేజీబీవీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, మెడికల్ రీయింబర్స్ మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంచాలని వినతిపత్రం అందించారు. తాము లేవనెత్తిన అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని సీఎస్‌ శాంతికుమారి తమకు హామీ ఇచ్చారని UTF రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చెప్పారు.