లాక్ డౌన్ తో భారీ న‌ష్టం..లైసెన్స్ ఫీజును రద్దు చేయాలి

లాక్ డౌన్ తో భారీ న‌ష్టం..లైసెన్స్ ఫీజును రద్దు చేయాలి

హైద‌రాబాద్: కరోనా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు గ్రేటర్ హైదరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్ అసొసియేషన్ సభ్యులు. లాక్ డౌన్ రిలాక్షేషన్ టైంలో తమకు వ్యాపారం జరగడం లేదని.. నష్టపోతున్నామంటూ.. ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాశారు. గతేడాది నుంచి కరోనాతో బిజినెస్ లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని.. అప్పులు చేసి లైసెన్స్ ఫీజులు కట్టామన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ బార్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని.. ఈ ఏడాది లైసెన్స్ ఫీజును రద్దు చేయాలని కోరారు బార్ అండ్ రెస్టారెంట్ అసొసియేషన్ నేతలు.