అయ్యో మిస్సయ్యా: మోడీ ట్వీట్‌పై వైరల్ అవుతున్న మెమ్స్

అయ్యో మిస్సయ్యా: మోడీ ట్వీట్‌పై వైరల్ అవుతున్న మెమ్స్

ఇవాళ ఉదయం ఏర్పడిన సూర్య గ్రహణాన్ని ప్రధాని మోడీ ఆసక్తిగా తిలకించాలని ప్రయత్నించినా.. మబ్బుల వల్ల చూడలేకపోయారు. సోలార్ ఫిల్టర్ గ్లాసెస్ పెట్టుకుని సూర్యుడిని మెల్లిగా చీకటి కమ్ముతున్న అద్భుత దృశ్యాన్ని మిస్స్ అయ్యానని ఆయన బాధపడ్డారు. గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేసినా మంచు, మబ్బులు కమ్మేయడంతో కుదరలేదని ట్వీట్ చేశారు. మెడలో మఫ్లర్ వేసుకుని, సన్ గ్లాసెస్, సోలార్ ఫిల్టర్స్‌తో గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేసిన ఫొటోల్ని ఆయన ట్విట్టర్‌లో పెట్టారు.

అందరిలా నాకూ ఆసక్తి

‘‘చాలా మంది భారతీయుల్లాగా నాకూ సూర్య గ్రహణం చూడాలని చాలా కుతూహలంగా ఉంది. దురదృష్టవశాత్తు మబ్బులు కమ్మేసి ఉండడంతో ఈ అద్భుతాన్ని చూడలేకపోయా. అయితే కోజికోడ్‌, ఇతర ప్రాంతాల్లో సూర్య గ్రహణ దృశ్యాల్నిటీవీ లైవ్‌లో చూడగలిగా. గ్రహణం, దాని విశేషాల గురించి ఎక్స్‌పర్ట్స్‌ని అడిగి తెలుసుకుని. నాలెడ్జ్ పెంచుకున్నా’’ అని మోడీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఎంజాయ్.. అని చెప్పిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ తాను సూర్య గ్రహణం చూసే ప్రయత్నం చేసిన ఫొటోలను ట్వీట్ చేయగానే ఓ నెటిజన్ దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మెమ్స్ చేస్తున్నారంటూ ఆయనకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. దీనిపై మోడీ చాలా సరదాగా స్పందించారు. ‘మోస్ట్ వెల్‌కం.. ఎంజాయ్’ అంటూ సమాధానమిచ్చారు.

More News:

తెలంగాణలో 30 శాతం మగవాళ్లు మందు ప్రియులే

పెళ్లికి పెద్దలు నో.. బావమరదళ్ల ఆత్మహత్య

2 లక్షల 30 వేల ప్రాణాలను మింగేసిన ప్రళయం

గ్రహణం ఎఫెక్ట్.. నిటారుగా నిలబడిన రోకలి

ట్విట్టర్లో వైరల్ అవుతున్న కొన్ని మెమ్స్: