అడవులను, ఆదివాసీలను రక్షించుకోవాలి : విమలక్క

అడవులను, ఆదివాసీలను రక్షించుకోవాలి : విమలక్క
  • కడవెండిలో మావోయిస్ట్‌‌‌‌ రేణుక సంస్మరణ సభ

జనగామ, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్ట్‌‌‌‌ రేణుక సంస్మరణ సభను బుధవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో పాటు పలువురు కవులు, కళాకారులు, విప్లవ రచయితలు, పౌర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ దోపిడీ, పీడన ఉన్నంతకాలం మావోయిస్ట్‌‌‌‌ రేణుక అలియాస్‌‌‌‌ మిడ్కో బతికే ఉంటుందని, ఆమె ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు.

 కార్పొరేట్‌‌‌‌ శక్తుల నుంచి అడవులను, ఆదివాసీలను రక్షించుకోవాలన్నారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో కడవెండి నుంచి పోరుబాట పట్టి అమరులైన ఎర్రంరెడ్డి సంతోశ్‌‌‌‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రేణుకలు భౌతికంగా దూరమైనా వారు మనమధ్యనే ఉంటారన్నారు. కడవెండి గ్రామం త్యాగాలకు నిలయమన్నారు. ఆదివాసీల రక్షణకు రేణుక చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం రేణుకను స్మరిస్తూ పాటలు పాడారు. కార్యక్రమంలో రేణుక కుటుంబ సభ్యులతో పాటు వీక్షణం ఎడిటర్‌‌‌‌ వేణుగోపాల్, విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రచయితలు ఏకే.ప్రభాకర్, అనురాధ, నర్సింహారెడ్డి, సంధ్య, రాజనర్సింహ, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ పాల్గొన్నారు.