సరదాగా నవ్వించే మేము కాప్‌‌‌‌ లం 

సరదాగా నవ్వించే మేము కాప్‌‌‌‌ లం 

నాగబాబు కొణిదెల, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రల్లో  ప్రదీప్ మద్దాలి రూపొందించిన వెబ్ సిరీస్ ‘మేము కాప్‌‌‌‌లం’. శుక్రవారం నుంచి జీ5లో స్ట్రీమింగ్‌‌‌‌ కానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రివ్యూ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ అతిథులుగా హాజరై ఈ సిరీస్ సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  

17 రోజుల్లోనే ఈ సిరీస్ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేశారని గెటప్ శ్రీను చెప్పాడు. టీమ్ అందరి సపోర్ట్‌‌‌‌తోనే ఇంత వేగంగా ఈ సిరీస్‌‌‌‌ను పూర్తి చేశానని దర్శకుడు ప్రదీప్ మద్దాలి అన్నాడు. నిర్మాత బీవీఎస్ రవి మాట్లాడుతూ ‘కోడి పోవడం, దాన్ని పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రంగంలోకి దిగడం,  అదే ఈ సిరీస్ కాన్సెప్ట్. 

చాలా సరదాగా సాగిపోతుంది’ అని చెప్పాడు. నటులు కిరిటీ దామరాజు,  రీతూ చౌదరి,  నటుడు రవితేజ,  నిర్మాత కౌముది,  జీ5 బిజినెస్ హెడ్ అనూరాధ, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కొమండూరి తదితరులు పాల్గొన్నారు.