అక్కడ మగాళ్లు చీర కట్టుకుని గార్బా డాన్స్​ చేస్తరు

అక్కడ మగాళ్లు చీర కట్టుకుని గార్బా డాన్స్​ చేస్తరు

గార్బా డాన్స్​... గుజరాత్​లో ఎంతో పాపులర్. పండుగొచ్చినా, పెళ్లి, పేరంటం ఏదైనా ఆడామగా కలిసి గార్బా డాన్స్​ చేస్తారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏమిటంటే.. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా  అహ్మదాబాద్​లో ఉన్న షాపూర్​లో మగవాళ్లు చీరకట్టుకుని మరీ గార్బా డాన్స్​ చేస్తారు. వీళ్లు  ఇలా చేయడం వెనుక ఒక ఆచారం ఉంది.

బరోత్​ కమ్యూనిటీకి చెందిన మగవాళ్లు ఈ కట్టుబాటుని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. రెండు వందల ఏళ్లుగా వస్తోన్న ఆచారం ఇది. దేవీశరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు రాత్రి చీరలు కట్టుకుని ‘సాదుబా’ మాత గుడికి వెళ్తారు. మగవాళ్లు చీరలు కట్టుకుని చేసే గార్బా డాన్స్​ని ‘శేరి గార్బా’ అంటారు.  రెండొందల ఏండ్ల శాపం నుంచి బయటపడడానికి వాళ్లు ప్రతి ఏడాది చీరలు కట్టుకుని ఈ డాన్స్​ చేస్తున్నారు. తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎక్కువ రోజులు బతకాలని, అనుకున్నవన్నీ జరగాలని  ప్రార్థిస్తారు. అలాగే  తమ పూర్వీకులు చేసిన తప్పుని క్షమించమని వేడుకుంటారు కూడా.  కాపాడడానికి రాలేదని ఒకప్పుడు ‘సాదుబా’ అనే మహిళ బిడ్డని కాపాడడానికి అక్కడి మగవాళ్లు ఎవరూ ముందుకు రాలేదట. ఆమె బిడ్డ చనిపోయిందట. దాంతో కోపగించిన ఆమె వాళ్లని శపించిందట. అందుకే  ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సందర్భంగా ఆమె అనుగ్రహం పొందడానికి మగవాళ్లు చీర కట్టుకుని డాన్స్​ చేస్తారని స్థానికులు చెబుతారు.