పీహెచ్​సీల్లోనే మెంటల్​ హెల్త్​ టెస్టులు

పీహెచ్​సీల్లోనే మెంటల్​ హెల్త్​ టెస్టులు

హైదరాబాద్​, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే (పీహెచ్​సీ) మానసిక రోగాలకు టెస్టులు, ట్రీట్​మెంట్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  మానసిక ప్రవర్తనలో తేడాలను గుర్తించి, కౌన్సెలింగ్​ చేసేలా డాక్టర్లకు శిక్షణ ఇవ్వను న్నారు.  మందులూ అందుబాటులో ఉంచనున్నారు. టెలీమెడిసిన్​ పద్ధతినీ తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో మారుమూల పల్లెల రోగులకు సైతం రాష్ర్ట, జాతీయ స్థాయి నిపుణులతో కౌన్సెలింగ్, ట్రీట్​మెంట్​ అందుతుంద ని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తున్నామని, పూర్తి కార్యాచరణ రూపొందించాక డాక్టర్లకు శిక్షణ ఇస్తామని వైద్యారోగ్యశాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. బెంగళూరు‌‌లోని నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్​ అండ్​ న్యూరో సైన్సెస్​ 10 రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్యంపై సర్వే చేయగా 14% మంది ఆ రోగాలతో బాధప డుతున్నట్టు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా మెంటల్​ హెల్త్​ స్క్రీనింగ్​ చేయాలని కేంద్రం నిర్ణయించింది.