
తాళంచెవు లు.. కాయిన్లు.. సిమ్ కార్డు.. పెన్సిల్ ను చెక్కే బ్లేడు.. అయస్కాంతం.. చోరీ కోసం దొంగ దగ్గరున్న వస్తువులు కావివి. ఓ వ్యక్తి పొట్టలో నుంచి తీసినవి. వాటిని లెక్కేస్తే 40 తేలాయి. చెన్నైలో కొద్ది రోజుల క్రితం జరిగిందీ ఘటన.
మానసిక సమస్యలతో బాధపడుతున్న జయకుమార్ అనే 52 ఏళ్ల వ్యక్తికి రెండు రోజుల పాటు ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ లు. నిజానికి అతడి మానసిక సమస్యల గురించి తెలుసుకోవడం కోసం మెదడుకు ఎంఆర్ ఐ స్కానింగ్ ను తీస్తుండగా పొట్టలో ఇవి ఉన్నట్టు గుర్తించారు. పొట్టలో ఉన్న అయస్కాంతానికి అవి అతుక్కుపోయినట్టు తెలుసుకున్నారు. ఆలస్యం చేస్తే అతడి ప్రాణానికే ప్రమాదమని గ్రహించిన డాక్టర్ లు వెంటనే గ్యాస్ట్రోస్కో పీ అనే రెండు ఆపరేషన్లు చేశారు. మొదటి ఆపరేషన్ లో 22, రెండో ఆపరేషన్ లో 18 వస్తువులను బయటకు తీశారు. వాటి వల్ల పొట్టలో రక్తం కారి సెప్టిక్ అయి ఉండేదని డాక్టర్ లు తెలిపారు. అతడు వాటిని మింగుతున్నాడన్న విషయమూ వారి కుటుంబ సభ్యులకు తెలియదట.