బెంజ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్‌

బెంజ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్‌

మెర్సిడెస్ -బెంజ్  గురువారం మెర్సిడెస్- ఏఎంజీ జీ 63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ ను లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బండి అని కంపెనీ చెబుతోంది.   

ఈ లిమిటెడ్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో  కేవలం 30 యూనిట్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ‘కలెక్టర్స్ ఎడిషన్’ను  మెర్సిడెస్ -బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇండియా (ఎంబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ)తో కలిసి డెవలప్ చేశారు. 

ఈ బండిలో 4.0-లీటర్ ట్విన్-టర్బో వీ8 ఇంజన్ (585 హెచ్‌‌‌‌‌‌‌‌పీ, 850 ఎన్‌‌‌‌‌‌‌‌ఎం టార్క్) ఉంటుంది. 100 కి.మీ స్పీడ్‌‌‌‌‌‌‌‌ను 4.4 సెకన్లలో అందుకుంటుంది.  టాప్ స్పీడ్ గంటకు 240 కి.మీ. ధర రూ. 4.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).