విద్యార్థులకు మెస్ చార్జీలు రూ. 5వేలకు పెంచాలి : ఆర్. కృష్ణయ్య

విద్యార్థులకు మెస్ చార్జీలు రూ. 5వేలకు పెంచాలి : ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులకు పెంచిన మెస్ చార్జీలను వెంటనే రివైజ్ చేసి రూ . 5 వేల కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. 100% ధరలు పెరిగితే 25% పెంచడం ఏమిటని ప్రశ్నించారు. 25% పెంచిన మెస్ చార్జీలు ఏ మూలకు సరిపోతాయి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ల సమస్యలను పరిష్కరించాలని లేదంటే  ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

 ఆగస్టు 23న తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగే విద్యార్థి సింహగర్జన పోస్టర్‌‌ను ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌లో ఆర్. కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం  స్టూడెంట్ల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 1,500 నుంచి రూ. 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 

అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్,  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు.  ధరలకు అనుగుణంగా పెంచాలిపెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ  డిమాండ్ చేశారు.