
హైదరాబాద్, వెలుగు: గిఫ్టింగ్, స్టేషనరీ పరిశ్రమ కోసం బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడానికి మెస్సే ఫ్రాంక్‌ఫర్ట్, ఎంఈఎక్స్ ఎగ్జిబిషన్స్ చేతులు కలిపాయి. గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్‌పో – ఢిల్లీ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశాయి. పేపర్ వరల్డ్ ఇండియా, కార్పొరేట్ గిఫ్ట్స్ షో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ పోర్ట్‌ఫోలియోలను విలీనం చేస్తున్నట్లు తెలిపాయి.
ఈ ప్లాట్ఫారమ్ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇది కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని, నేషనల్ఎకోసిస్టమ్ఏర్పడుతుందని మెస్సే ఫ్రాంక్‌ఫర్ట్, ఎంఈఎక్స్ ఎగ్జిబిషన్స్ తెలిపాయి. భారతీయ స్టేషనరీ పరిశ్రమ రాబోయే ఐదేళ్లలో 8–-10 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా.