META: మెటాలో ట్విట్టర్ తరహా పెయిడ్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్

META: మెటాలో ట్విట్టర్ తరహా పెయిడ్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్

ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ తరహాలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించాడు. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని మొదట న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ వారం ప్రారంభిస్తారు. తర్వాత మిగిలిన దేశాల్లోకి తీసుకురానున్నారు. 

మెటాలో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ కావాలంటే గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు రూ.990, ఐఓఎస్ (యాపిల్) యూజర్లు రూ.1240 చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. వెరిఫికేషన్ అయిన 24 గంటల్లోపు బ్లూటిక్ వస్తుంది. అయితే, ఈ సేవల్ని కేవలం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకే అందించనున్నారు.