ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ : 3 పదాల మధ్య హోరాహోరీ పోరు

ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ : 3 పదాల మధ్య హోరాహోరీ పోరు

డిక్షనరీల విభాగంలో ఖ్యాతి గడించిన పేరు ‘ఆక్స్ఫర్డ్’. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనే సంస్థ ఆక్స్ ఫర్డ్  డిక్షనరీలను ప్రచురిస్తుంటుంది. ఈ సంస్థ ఏటా ‘ఆక్స్ ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటిస్తుంటుంది. తొలిసారిగా ఈ ఏడాది అందుకోసం ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈసారి వర్డ్ ఆఫ్ ది ఇయర్ రేసులో “Metaverse”,  “#IStandWith”, “Goblin Mode” అనే మూడు పదాలు ఉన్నాయి. ఈ పోటీలో అన్నింటికంటే ముందంజలో “Metaverse” ఉంది. ఎందుకంటే  ఇటీవల ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన పేరును  “Meta”గా మార్చుకుంది. అప్పటి నుంచి మెటా వర్స్ (Metaverse) టెక్నాలజీపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో, టెక్ రంగంలో Metaverse ఒక సంచలనంగా మారనుందనే టాక్ నడుస్తోంది.

ఈనేపథ్యంలో ఈసారి ఓటింగ్ లో Metaverse పైచేయి సాధించే అవకాశం ఉందని  పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి నవంబరు 21న మొదలైన ఓటింగ్ డిసెంబరు 2న ముగియనుంది. డిసెంబరు 5న రిజల్ట్ ను ప్రకటించనున్నారు. ఈసారి  ఆన్ లైన్ ఓటింగ్ లో మీరు కూడా పాల్గొనొచ్చు. మీకు ఇష్టమైన ఒక పదానికి ఓటు వేయొచ్చు. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఈకింది లింక్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది. 

https://languages.oup.com/word-of-the-year/2022/#WOTY2022vote 
 

  • గతేడాది ‘ఆక్స్ ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్’ గా  ‘వ్యాక్స్’ (vax) ఎంపికైంది.