అలర్ట్..అలర్ట్..భారీ వర్ష సూచన...

అలర్ట్..అలర్ట్..భారీ వర్ష సూచన...

రాష్ట్రాన్ని వరుణుడు వదలడం లేదు. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లోనూ వానలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా...మరోసారి కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

అప్రమత్తంగా ఉండాలి..

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 040-21111111 నెంబర్ ను సంప్రదించాలని కోరింది.

హైదరాబాద్తో పాటు..  తెలంగాణలోని పలు జిల్లాల్లో  వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావారణ శాఖ ప్రకటించింది.  రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. విదర్భ నుంచి తమిళనాడు, తెలంగాణ మీదుగా ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావారణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే వానలు పడుతుండగా.. రానున్న మూడు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మరో మూడు రోజులు వర్షాలు తప్పవని చెబుతున్నారు.