పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో

పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో

పాతబస్తీవాసులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న  ఎంజీబీఎస్ - ఫలక్నుమా మధ్య మెట్రో రైల్ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. హైదరాబాద్ మెట్రోకు రూ. 1500కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోకు మరో రూ.500 కోట్లు ప్రతిపాదించింది.  

మెట్రో మూడు కారిడార్లలో ఒకటైన పరేడ్‌ గ్రౌండ్‌ - ఫలక్‌నుమా కారిడార్‌ను మొత్తం 14 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే అలైన్ మెంట్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన 5.5 కిలో మీటర్ల మార్గం నిర్మాణం ఆగిపోయింది. దీంతో జేబీఎస్‌ పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు పూర్తయిన 9.6 కిటోమీటర్ల మార్గాన్ని 2020లో అందుబాటులోకి తెచ్చారు. తాజాగా అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ప్రభుత్వం ఫలక్ నుమా వరకు మెట్రోను పొడగించేందుకు సిద్ధమైంది. త్వరలో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనుంది.