వేములవాడలో మేడారం రద్దీ

వేములవాడలో మేడారం రద్దీ

వేములవాడ, వెలుగు : ముందస్తు మొక్కుల కోసం మేడారం వెళ్తున్న భక్తులతో సోమవారం వేములవాడలోని భీమేశ్వరస్వామి, బద్ది పోచమ్మ ఆలయాలు కిటకిటలాడాయి. వరంగల్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 

అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో సోమవారం రాత్రి నుంచి 24 గంటల పాటు ఆలయాన్ని తెరిచే ఉంచనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.