హైదరాబాద్ మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్ కు.. ఏజెన్సీలు ఖరారు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్ కు.. ఏజెన్సీలు ఖరారు
  • ఆర్వీ అసోసియేట్స్, సిస్ట్రా కన్సల్టెన్సీ ఎంపిక
  • నాలుగు ప్యాకేజీలు.. 12 కారిడార్లకు డీపీఆర్ తయారు
  • హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు:  మెట్రో రైల్ ఫేజ్–3 ప్రాజెక్టులకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్​) లు  తయారు చేసేందుకు  మెట్రో రైల్ కన్సల్టెన్సీలను శనివారం ఖరారు చేసింది. ఇందుకు గతంలోనే ఐదు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు బిడ్లు సమర్పించగా...గత నెల 30న వాటిని మెట్రో అధికారులు ఓపెన్ చేశారు.  అర్హత కలిగిన ఆర్వీ అసోసియేట్స్, యుఎంటీసీ, రైట్స్, సిస్ర్టా అనే నాలుగు కన్సల్టెన్సీలను సెలెక్ట్ చేసినట్టు శనివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఆయా కన్సల్టెన్సీలు మెట్రో రైల్ –3వ ఫేజ్ లో భాగంగా 12 కారిడార్లకు డీపీఆర్ లు రూపొందించినున్నట్టు వెల్లడించారు. ఇందులో టెండర్ నిబంధనల మేరకు ఆర్వీ అసోసియేట్స్ కు 2 ప్యాకేజీలు, మిగతా  2 ప్యాకేజీలను సాంకేతిక పరంగా రెండో స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థ అతి తక్కువ ఆర్థిక బిడ్ తో కోట్ చేయగా ఆ సంస్థకు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.