ట్రంక్ సీవర్ పనులు వేగంగా పూర్తి చేయండి : మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

ట్రంక్ సీవర్ పనులు వేగంగా పూర్తి చేయండి : మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ట్రంక్ సీవర్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని మెట్రోవాటర్‌ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పూడుకుపోయిన మాన్​హోల్స్‌ను గుర్తించి, భవిష్యత్​లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 మంగళవారం వనస్థలిపురం ఓల్డ్ బాంబే– -విజయవాడ హైవే వద్ద ధ్వంసమైన 900 ఎంఎం డయా ఆర్​సీసీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్​లైన్ మరమ్మతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పైప్​లైన్ విస్తరణ పూర్తయిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో సోమవారం  సీవర్ లైన్‌ సుమారు 20 అడుగుల లోతులో కుంగిపోవడంతో వెంటనే స్పందించిన  అధికారులు మరమ్మతు పనులు పనులను చేపట్టారు.