
ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఈవీని రూ.69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికల్) కియా కార్నివాల్, టొయోటా వెల్‌ఫైర్‌తో పోటీ పడుతుంది. డెలివరీలు ఈ ఏడాది ఆగస్టు 10 నుంచి ప్రారంభమవుతాయి. ఎంజీ సెలెక్ట్ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా ఈ కారును కంపెనీ అమ్మనుంది. లెవెల్ 2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 90 కిలోవాట్‌అవర్ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్‌పై 548కి.మీ వెళుతుందని కంపెనీ చెబుతోంది.