వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు..

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు..
  • ఎంజీఎంలో ఘటనలపై మంత్రి రాజనర్సింహ సీరియస్ 

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ కిషోర్ కుమార్ పై వేటు పడింది. ఇటీవల ఎంజీఎం సేవల్లో అలసత్వంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ అయ్యారు. దీనికితోడు శనివారం పిల్లల విభాగంలో ఒకే ఆక్సిజన్ సిలిండర్​ను ఇద్దరు పిల్లలకు వినియోగిస్తూ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.  ఇద్దరు చిన్నారులకు ఒకే సిలిండర్​ ద్వారా ఆక్సిజన్​ అందిస్తూ తరలించడం కలచివేసింది. 

దీంతో సూపరిండెంట్ కిషోర్ కుమార్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటల్‌‌‌ను గాడిన పెట్టేందుకు ప్రతి వారం ఎంజీఎంపై సమీక్ష చేసి తనకు నివేదిక సమర్పించాలని డీఎంఈని ఆదేశించారు. ఎంజీఎంలో ఏండ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగుల వివరాలు సేకరించి, వారి పనితీరుపై నివేదిక సమర్పించాలని సూచించారు.