ఢిల్లీ కోచింగ్ సెంటర్ మరణాలు: విచారణకు MHA కమిటీ ఏర్పాటు

ఢిల్లీ కోచింగ్ సెంటర్ మరణాలు: విచారణకు MHA కమిటీ ఏర్పాటు

ఢిల్లీ కోచింగ్ సెంటర్ లో మరణాలపై దర్యాప్తు చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు X లో పోస్ట్ చేశారు. కమిటీలో MOHUA అదనపు కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), ఢిల్లీ ప్రభుత్వం, స్పెషల్ సీపీ, ఢిల్లీ పోలీస్, ఫైర్ అడ్వైజర్, జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) కన్వీనర్ గా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను 30 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఏడుగురు నిందితులు అరెస్టు:

ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులుఏడుగురు నిందితులను అరెస్టు చేయగా వారికి తీస్ హజారీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అరెస్టయిన వారిలో నలుగురు బిల్డింగ్ యజమానులు, ఒకరు కోచింగ్ సెంటర్ యజమాని, మరొకరు కోఆర్డినేటర్,  ఒక డ్రైవర్ ఉన్నారు. 

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి నోటీసు అందజేత:

కోచింగ్ సెంటర్ పర్మిషన్లు, క్లియరెన్స్, సహాయక చర్యల గురించి సమాచారం కోరుతూ ఢిల్లీ పోలీసులు MCDకి కూడా లేఖ రాశారు. జూలై 27న ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రవుస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా  సమాచారం కోరుతూ ఎంసీడీకి నోటీసులు అందజేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.