మే 17 వ‌ర‌కు లాక్ డౌన్: రెడ్ జోన్ల‌లోనూ ఈ స‌ర్వీసులు ఓపెన్

మే 17 వ‌ర‌కు లాక్ డౌన్: రెడ్ జోన్ల‌లోనూ ఈ స‌ర్వీసులు ఓపెన్

దేశ వ్యాప్తంగా క‌రోనా లాక్ డౌన్ ను మే 17 వ‌ర‌కు పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే లాక్ డౌన్ అమ‌లులో నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ కొంత మేర ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు అవ‌కాశ‌మిస్తూ కేంద్రం హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభ‌జించి ఎక్క‌డెక్క‌డ ఏయే ప‌నులు చేసుకోవ‌చ్చు, ఎలాంటి స‌ర్వీసుల‌కు అనుమ‌తి ఇస్తుంద‌న్న వివ‌రాల‌తో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.  రెడ్ జోన్ జిల్లాల్లోనూ కొన్ని మిన‌హాయింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ.. క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్న కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం ఎటువంటి స‌డ‌లింపులు లేకుండా లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది.

More News:

లాక్ డౌన్ లో బైక్ పై ఇద్ద‌రికి ఓకే.. ఆర్టీసీ బస్సులు స్టార్ట్: జోన్ల వారీగా ఏయే స‌ర్వీసులంటే..

మే 4 నుంచి లిక్క‌ర్ షాపులు ఓపెన్: క‌ండిష‌న్స్ అప్లై

జోన్ల‌తో సంబంధం లేకుండా దేశ‌మంతా ఇవి క్లోజ్

దేశ‌మంతా రైళ్లు, విమాన సర్వీసులు, మాల్స్, థియేట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా బంద్ చేయాల‌ని ఆదేశించింది. బార్బ‌ర్ షాపులు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ కు ఏ జోన్ లోనూ అనుమ‌తి లేదు. అయితే ఆరెంజ్ గ్రీన్ జోన్ల‌లో ప‌రిమిత స్థాయిలో ఆయా జిల్లాల్లో ర‌వాణాకు అనుమ‌తి ఇచ్చింది. కాబ్స్ లో డ్రైవ‌ర్ తోపాటు మ‌రో ఇద్ద‌రు ప్ర‌యాణించే వీలు క‌ల్పించింది. గ్రీన్ జోన్ల‌లో 50 శాతం సీటింగ్ తో ఆర్టీసీ బ‌స్సుల‌ను కూడా తిప్పేందుకు అవ‌కాశం ఇచ్చింది. టూ వీల‌ర్స్ పై ఇద్ద‌రు తిరిగేందుకు అనుమ‌తిచ్చింది. అలాగే రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకునేందుకు గ్రీన్ జోన్ల‌లో లిక్క‌ర్ షాపులు, పాన్ షాపుల‌ను ఓపెన్ చేసేందుకు వీలు క‌ల్పించింది. అయితే రెడ్ జోన్ల‌లోనూ ఉపాధి హామీ, బ్యాంకు వంటి కొన్ని స‌ర్వీసుల‌ను అనుమ‌తించింది.

రెడ్ జోన్ల‌లో కూడా ఈ స‌ర్వీసులు, ప‌నుల‌కు ఓకే

– రెడ్ జోన్ల‌లో ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లోనూ అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు ఓపెన్ చేయొచ్చు. నిర్మాణ ప‌నుల‌ను చేసుకోవ‌చ్చు. ఇటుక బ‌ట్టీల వంటివి ఓపెన్ చేయొచ్చు.

– దేశ‌మంతా మ‌హాత్మా గ్రామీణ‌ ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌ ప‌నులు చేయించ‌డం ద్వారా పేద‌ల‌కు ఉపాధి క‌ల్పించవ‌చ్చు.

– ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప‌నులు చేసుకోవ‌చ్చు. షాపింగ్ మాల్స్ త‌ప్ప అన్ని షాపులు తీయొచ్చు.

– వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకోవ‌చ్చు. పంట కోత‌లు అయ్యాక అమ్మ‌కాల‌కు అనుమ‌తి.

– అన్ని ఆస్ప‌త్రులు ఓపెన్ చేసి రోగుల‌కు సేవ‌లు అందించ‌వ‌చ్చు. అయితే వైద్య సిబ్బంది త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బంది, అంబులెన్స్ ల ర‌వాణాకు అనుమ‌తి.

– బ్యాంకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థ‌లు, కో ఆప‌రేటివ్ సొసైటీలు కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

– అంగ‌న్వాడీలకు అనుమ‌తి.

– ప‌వ‌ర్, వాట‌ర్, శానిటేష‌న్, టెలీ క‌మ్యూనికేష‌న్స్, ఇంట‌ర్నెట్, కొరియ‌ర్, పోస్ట‌ల్ స‌ర్వీసులకు గ్రీన్ సిగ్న‌ల్.

– మాల్స్ త‌ప్పించి ఇత‌ర చిన్న చిన్న షాపులు అన్నీ ఓపెన్ చేసుకోవ‌చ్చు.

– మీడియా, ఐటీ స‌ర్వీసులు, కాల్ సెంట‌ర్లు, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేటు సెక్యూరిటీ స‌ర్వీసులకు అనుమ‌తి ఇచ్చింది కేంద్రం.

– నిత్యావ‌స‌రాలు, అత్య‌వస‌ర వ‌స్తువుల సేల్స్ కు అనుమ‌తి. వాటి త‌యారీకి వీలు. ఫార్మా, మెడిక‌ల్ డివైజ్ ల త‌యారీకి సంబంధించిన యూనిట్లు ఓపెన్. అలాగే వాటి స‌ర‌ఫ‌రాకు స‌మ‌స్య లేకుండా చూడాల‌ని ఆదేశించింది.

– 33 శాతం ఉద్యోగుల‌తో ప్రైవేటు కంపెనీలు ప‌ని చేయొచ్చు.

– ఈ మిన‌హాయింపులను వినియోగించునే ప్ర‌జ‌లు, కంపెనీలు త‌ప్ప‌నిస‌రిగా సోష‌ల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ను పాటించాలి. త‌ర‌చూ చేతులను స‌బ్బు లేదా ఆల్క‌హాల్ బేస్డ్ శానిటైజ‌ర్ల‌తో శుభ్రంగా క‌డుక్కోవాలి. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి.