ఉల్లి రైతుల ఉద్యమం.. ఓటు వేయం అంటూ తిరుగుబాటు

ఉల్లి రైతుల ఉద్యమం.. ఓటు వేయం అంటూ తిరుగుబాటు

గతంలో జరిగిన పలు ఎన్నికల ఫలితాలపై ఉల్లి ధరలు  ప్రభావం చూపడం తెలిసిందే. ఉల్లి ధరల ఘాటుకు ప్రభుత్వాలే మారిపోయిన సందర్భాలు దేశ చరిత్రలో చాలానే ఉన్నాయి.  ఉల్లి ధరలు చుక్కలు తాకుతూ కంటితడి పెట్టించినప్పుడుల్లా పాలకులకు సామన్య ప్రజానీకం తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో సీన్ రివర్స్ అయ్యింది.  మాల్వాడీ పంచాయితీ పరిసర ప్రాంతాల్లోని రైతులు 2024 లోక్​ సభ ఎన్నికలను బహిష్కరిస్తామని బోర్డ్​లు ఏర్పాటు చేస్తున్నారు.

 ఉల్లి ధరల ఘాటుకు ప్రభుత్వాలే మారిపోయిన సందర్భాలు దేశ చరిత్రలో చాలానే ఉన్నాయి.  ఉల్లి ధరలు చుక్కలు తాకుతూ కంటితడి పెట్టించినప్పుడుల్లా పాలకులకు సామన్య ప్రజానీకం తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు.  మహారాష్ట్రలోని నాశిక్​ జిల్లా మాల్వాడి పంచాయతీతో పాటు సమీప గ్రామాల ఉల్లి రైతులు ఆందోళన బాట పట్టారు.  ఉల్లి పంటకు  మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనందున .. 2024 లోక్​ సభ ఎన్నికలను బహిష్కరించాలని బోర్డ్​ లు ఏర్పాటు చేశారు. .

ఇప్పుడు మహారాష్ట్రలో సీన్ రివర్స్ అయ్యింది. గత కొన్ని వారాలుగా కిలో ఉల్లి ధర రూపాయికి పడిపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఉల్లికి సరైన ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమకు ఈ గతి పట్టడానికి  ప్రభుత్వాల నిర్ణయాలే  కారణమని ఉల్లి రైతులు ఆరోపిస్తున్నారు. లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు  మాల్వాడీ పంచాయతీ పరిసర గ్రామాలకు వస్తే రైతుల బాధలు తెలుస్తాయని ఈ బోర్డ్​ లు ఏర్పాటు చేశారు. 

అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తే ఉల్లి రైతుల ప్రాధాన్యత, వారి సమస్యలు తెలుస్తాయని రైతులు ఆశగా ఈ సైన్ బోర్డు పెట్టారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉల్లి పండించే రైతులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించక వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నా.. తమను ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  2023 మార్చిలో మాల్వాడీ ఉల్లి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శకు రాని అధికార, ప్రతిపక్ష నేతలు .. ఇప్పుడు అదే గ్రామంలోకి  ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలను అడ్డుకున్నారు.  

ఉల్లి రైతులు గత కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నారు. ఉల్లి సాగుకు అయ్యే ఖర్చును పరిశీలిస్తే ఉల్లికి గిట్టుబాటు ధర లభించడం లేదు. గత ఏడాది మార్చిలో గ్రామం మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు మాల్వాడీలో కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరూ రాలేదని రైతులు వాపోతున్నారు. అందుకే ఇప్పుడు అదే నాయకులను గ్రామంలోకి వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తారా లేదా అని అడగకుండా అడ్డుకున్నారు ఉల్లి రైతులు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రైతులు నష్టపోయామని ఉల్లి రైతులు తెలిపారు.  ఉల్లి ధరలను నియంత్రణలో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని... ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించడంతో రైతుల ఆదాయానికి భారీగా గండిపడిందని వారు వాపోయారు.  రైతులకు గిట్టుబాటు ధర  కేంద్ర ప్రభుత్వం విఫలమైనందున  ఇక్కడి రైతులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు బోర్డులు పెడుతున్నారు.