రెడ్ మీ సూపర్ సేల్.. ఆఫర్లు ఇవే..

రెడ్ మీ సూపర్ సేల్.. ఆఫర్లు ఇవే..

సరికొత్త ఆఫర్లతో మార్కెట్లో తన సత్తా చాటుతోంది షియోమీ రెడ్మీ. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో సామాన్య ప్రజలకు అందుబాటులో కొత్త మోడల్స్ ను తీసుకొస్తుంది. పండగ వచ్చిందంటే ఏదో ఒక సేల్ తో ఆఫర్లను ప్రకటిస్తుంది. గత వారం సేల్ ముగించుకున్న షియోమీ ఈ వారం సూపర్ సేల్ తో మార్కెట్లోకి వస్తుంది.  డిసెంబర్ 6 నుంచి 12 వరకు ఈ సూపర్ సేల్ అందుబాటులో ఉంటుంది.ఈ సూపర్ సేల్ ఆఫర్లు  Mi.com తో పాటు ఇతర ఆన్ లైన్ పోర్టల్ లో కూడా అందుబాటులో ఉంటాయి.

రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి కె 20 ప్రో వంటి కొన్ని ప్రముఖ మోడళ్లు తక్కువ ధరలకు ఈ సేల్ లో ఉన్నాయి. అయితే రెడ్‌మి నోట్ 8 సిరీస్ నుండి ఇటీవల విడుదల చేసిన మోడళ్లు అమ్మకానికి లేవు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ఇఎంఐలతో 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సూపర్ సేల్ లో ఉన్న మోబైట్స్ పై ఆఫర్లు ఇవే..

రెడ్‌మి నోట్ 7 ప్రో

రెడ్‌మి నోట్ 7 ప్రో లో.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో రూ.10,999 కు లభిస్తుంది.  6జిబి ర్యామ్, 64 జిబి స్టేరేజ్ తో రూ.12,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ .14,999. 

రెడ్‌మి నోట్ 7 ఎస్

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్‌మి నోట్ 7 ఎస్ ధర రూ .8,999. ఇందులోనే 4 జీబీ ర్యామ్ కావాలంటే రూ. 9,999 చెల్లించాల్సి ఉంటుంది. రెడ్‌మి నోట్ 7 ఎస్ లో స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

రెడ్‌మి కె 20

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న  రెడ్‌మి కే 20  రూ .19,999 కు లభిస్తుంది. ఇందులోనే 128 జీబీ స్టోరేజ్ తో కావాలంటే రూ .22,999 లభిస్తుంది.

రెడ్‌మి కె 20 ప్రో

రెడ్‌మి కె 20 ప్రో ప్రస్తుతం భారతదేశంలో షియోమి యొక్క ప్రధాన ఫోన్ . ఇది 6 జిబి ర్యామ్ , 128 జిబి స్టోరేజ్‌తో ఉంటుంది. ఇందులో రూ .25,999 నుంచి ప్రారంభ ధరలు ఉన్నాయి.  8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో రూ .28,999 గా ఉంది.

రెడ్‌మి గో

భారతదేశంలో షియోమి నుండి తక్కువ ధరలో ఉన్న ఫోన్ రెడ్‌మి గో రూ .4,499కే లభిస్తుంది. రెడ్‌మి గో 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్.

పోకో ఎఫ్ 1

పోకో ఎఫ్ 1 దాని స్నాప్‌ డ్రాగన్ 845 చిప్‌సెట్ , లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో  రూ .14,999 (6 జిబి ర్యామ్ , 128 జిబి స్టోరేజ్‌తో)కే మార్కెట్లో లభిస్తుంది.  రూ.18,999 లకు 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  తో ఉంటుంది.