MI vs DC: రొమారియో షెఫర్డ్ ఉచకోత.. ఢిల్లీ టార్గెట్ 235 పరుగులు

MI vs DC: రొమారియో షెఫర్డ్ ఉచకోత.. ఢిల్లీ టార్గెట్ 235 పరుగులు

వాంఖ‌డే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెఫర్డ్(39 నాటౌట్) పరుగులతో రాణించారు.

హిట్ మ్యాన్ మెరుపులు

టాస్ గెలిచి బ్యాటింగ్ కు ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. దీంతో ముంబై  పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో హిట్ మ్యాన్.. అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్‌ అవ్వగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే సూర్య కుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఆపై కొద్దిసేపటికే మంచి టచ్‌లో కనిపించిన కిషన్(42).. అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడినుంచి ముంబై స్కోరు బోర్డులో వేగం తగ్గింది. పాండ్యా(39)- టిమ్ డేవిడ్ కాసేపు ఆచి తూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక డేవిడ్(45 నాటౌట్; 21 బంతుల్లో  2 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ కు పని చెప్పాడు. చివరలో రొమారియో షెఫర్డ్(39 నాటౌట్;10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అన్రిచ్ నోర్ట్జే వేసిన ఆఖరి ఓవర్ లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఢిల్లీ బౌలర్లంతా ఒకే రూటు

ఢిల్లీ బౌలర్లలో అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అన్రిచ్ నోర్ట్జే(4 ఓవర్లలో 65 పరుగులు), ఖలీల్ అహ్మద్(4 ఓవర్లలో 39 పరుగులు), జై రిచర్డ్‌సన్(4 ఓవర్లలో 40 పరుగులు), అక్సర్ పటేల్(4 ఓవర్లలో 35 పరుగులు), ఇషాంత్ శర్మ(3 ఓవర్లలో 40 పరుగులు) ఇచ్చారు.