MI vs DC: రోహిత్, సూర్య ఔట్.. ముంబై జోరుకు బ్రేకులు

MI vs DC: రోహిత్, సూర్య ఔట్.. ముంబై జోరుకు బ్రేకులు

ముంబై ఇండియన్స్‌ జోరుకు బ్రేకులు పడ్డాయి. నాలుగు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తిస్తున్న రోహిత్‌ శర్మ(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 49 పరుగుల వద్ద అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో  బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 80 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్‌ కోల్పోయింది. 

అనంతరం ఆ మరుసటి ఓవర్‌లోనే సూర్య కుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. చాన్నాళ్ల తరువాత మైదానంలోకి దిగిన సూర్య.. అభిమానులను అలరించకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో ముంబై 81 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ స్కోర్.. 8 ఓవర్లు ముగిసేసరికి 84/2. ఇషాన్‌ కిషన్ (26*), హార్దిక్ పాండ్యా(3*) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ముంబై.. తొలి 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది.