MI vs DC: ముంబై ఓపెనర్ల ధనాధన్ బ్యాటింగ్.. పవర్ ప్లేలో 75 పరుగులు

MI vs DC: ముంబై ఓపెనర్ల ధనాధన్ బ్యాటింగ్.. పవర్ ప్లేలో 75 పరుగులు

వరుస ఓటములో.. జట్టులోకి సూర్య వచ్చాడన్న ధైర్యమో కానీ, ముంబై బ్యాటర్లు వీరవిహారం చేస్తున్నారు. క్రీజులోకి వచ్చింది మొదలు ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ధనాధన్ బ్యాటింగ్ తో హోరెత్తిస్తున్నారు. బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ముంబై ఓపెనర్లను కట్టడి చేయలేక ఢిల్లీ బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు. 

రోహిత్ శర్మ(49 నాటౌట్; 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్(20 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. వీరిద్దరి ధాటికి ముంబై  పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు వీలైనంత త్వరగా వీరిని పెవిలియన్ చేర్చాలి. లేదంటే మ్యాచ్ వన్ సైడ్ అయ్యే  అవకాశం లేకపోలేదు.