గుజరాత్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 218పరుగులు చేసింది. గుజరాత్ కు భారీ టార్గెట్ ను నిర్దేశిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ 31, రోహిత్ శర్మ 29 పరుగులతో మంచి శుభారంభాన్ని అందించారు.
ఇక ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ మరోసారి చెలరేగి పోయాడు. ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. సూపర్ సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విష్ణు వినోద్ 30 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు. ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, నెహాల్ వాధేరా, టిమ్ దేవిడ్ లాంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ తీశాడు
