సూర్య దంచె.. ముంబై గెలిచె

సూర్య దంచె.. ముంబై గెలిచె
  • 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ
  • రాణించిన ఇషాన్‌‌‌‌, రోహిత్‌‌‌‌, బుమ్రా
  • డుప్లెసిస్‌‌‌‌, కార్తీక్‌‌‌‌, రజత్‌‌‌‌ శ్రమ వృథా

ముంబై:  ఐపీఎల్‌‌‌‌–17లో ముంబై ఇండియన్స్‌‌‌‌ గాడిలో పడింది. ఛేజింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 69) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌కు సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (19 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 52) సునామీ బ్యాటింగ్‌‌‌‌ తోడవ్వడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. టాస్‌‌‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. డుప్లెసిస్‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 61), రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 50), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 53*) దంచికొట్టారు. తర్వాత ముంబై 15.3 ఓవర్లలో 199/3 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌‌‌‌ శర్మ (38), హార్దిక్‌‌‌‌ పాండ్యా (21) రాణించారు.  బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

బుమ్రా ‘పాంచ్‌‌‌‌’

ఆర్‌‌‌‌సీబీ ఇన్నింగ్స్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ నిలకడగా ఆడినా, థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే విరాట్(3)ను ఔట్‌‌‌‌ చేసిన బుమ్రా (5/21).. చివరి రెండు ఓవర్లలో ఏకంగా 4 వికెట్లు తీశాడు. కానీ మధ్యలో రజత్‌‌‌‌, దినేశ్‌‌‌‌ ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో భారీ స్కోరు అందించారు. ఫోర్త్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌(8) వికెట్‌‌‌‌ పడటంతో పవర్‌‌‌‌ప్లేలో బెంగళూరు 44/2 స్కోరు చేసింది. డుప్లెసిస్‌‌‌‌తో కలిసిన రజత్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. మిడాఫ్‌‌‌‌, మిడాన్‌‌‌‌, లాంగాన్‌‌‌‌లో 4 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 25 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఈ ఇద్దరు థర్డ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు కేవలం 47 బాల్స్‌‌‌‌లోనే 82 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు. 12వ ఓవర్‌‌‌‌లో కోయెట్జీ (1/42)... రజత్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (0) క్రీజులోకి వచ్చి డకౌటయ్యాడు. దీంతో 105/2గా ఉన్న స్కోరు108/3గా మారింది. ఈ దశలో దినేశ్‌‌‌‌ సుడిగాలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసిన డుప్లెసిస్‌‌‌‌ 33 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ మార్క్‌‌‌‌ అందుకున్నాడు. 15వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో స్కోరు 130/4కి చేరింది. 16వ ఓవర్‌‌‌‌లో కార్తీక్‌‌‌‌ 4 ఫోర్లు బాదినా, 17వ ఓవర్‌‌‌‌లో బుమ్రా డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. వరుస బాల్స్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌, మహిపాల్‌‌‌‌ లోమ్రోర్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దీంతో ఐదో వికెట్‌‌‌‌కు 26 బాల్స్‌‌‌‌లో 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 19వ ఓవర్‌‌‌‌లో బుమ్రా దెబ్బకు సౌరవ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ (9), విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (0) ఔటైనా, కార్తీక్‌‌‌‌ 6, 6, 6, 4 దంచాడు. ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 89/2 రన్స్‌‌‌‌ చేసిన ఆర్‌‌‌‌సీబీ చివరి పది ఓవర్లలో 107/6 రన్స్‌‌‌‌ చేసింది. 

ఇషాన్‌‌‌‌, సూర్య మెరుపులు..

ఛేజింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌, రోహిత్‌‌‌‌, సూర్య బెంగళూరు బౌలింగ్‌‌‌‌ను ఉతికేసిన్రు. సిక్స్‌‌‌‌తో ఖాతా తెరిచిన ఇషాన్‌‌‌‌ 4, 4, 4తో రెచ్చిపోయాడు. రోహిత్‌‌‌‌ కూడా సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. కానీ సిరాజ్ వేసిన ఐదో ఓవర్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ 6, 4, 6, 6తో 23 రన్స్‌‌‌‌, తర్వాతి ఓవర్‌‌‌‌లో 4, 6, 4తో 17 రన్స్‌‌‌‌ దంచాడు. దీంతో పవర్‌‌‌‌ప్లేలో 72/0 స్కోరు చేసింది. ఈ క్రమంలో ఇషాన్‌‌‌‌ 23 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ వెంటనే రోహిత్‌‌‌‌ 6, 4 కొట్టాడు. 9వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన ఇషాన్‌‌‌‌ కోహ్లీకి క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 101 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 10 ఓవర్లలో ముంబై 111/1 స్కోరు చేసింది. 11వ ఓవర్‌‌‌‌లో సూర్య  4, 6, 6, 6తో 24 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. 12వ ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ కొట్టిన రోహిత్‌‌‌‌ తర్వాతి బాల్‌‌‌‌కు వెనుదిరగడంతో రెండో వికెట్‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌ వచ్చాయి. హార్దిక్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో ఆట మొదలుపెట్టగా, సూర్య 4తో జోరును కొనసాగించాడు. 13వ ఓవర్‌‌‌‌లో 4, 6, 4, 4తో 17 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 14వ ఓవర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ 6 కొట్టగా, సూర్య ఔటయ్యాడు. థర్డ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 37 రన్స్‌‌‌‌ జతయ్యాయి. చివరి 23 రన్స్‌‌‌‌ను తిలక్‌‌‌‌ వర్మ (16*) మూడు ఫోర్లు, హార్దిక్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో 12 బాల్స్‌‌‌‌లోనే ముగించారు. 

సంక్షిప్త స్కోర్లు :  బెంగళూరు: 20 ఓవర్లలో 196/8 (డుప్లెసిస్‌‌‌‌ 61, రజత్‌‌‌‌ 50, దినేశ్‌‌‌‌ 53*, బుమ్రా 5/21). ముంబై: 15.3 ఓవర్లలో 199/3 (ఇషాన్‌‌‌‌ 69, సూర్య 52, విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ 1/24).