MI vs RR: ముగ్గురు గోల్డెన్ డక్.. తీవ్ర కష్టాల్లో ముంబై ఇండియన్స్

MI vs RR: ముగ్గురు గోల్డెన్ డక్.. తీవ్ర కష్టాల్లో ముంబై ఇండియన్స్

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ పేసర్ ట్రెంట్ బోల్ట్ నిప్పులు చెరుగుతున్నాడు. తొలి ఓవర్‌లో రోహిత్ శర్మ(0), నమన్ ధీర్(0)లను పెవిలియన్ చేర్చిన బోల్ట్.. తదుపరి ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్(0)ను ఔట్ చేశాడు. దీంతో ముంబై 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురూ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం గమనార్హం.

ప్రస్తుతం ముంబై స్కోర్ 3 ఓవర్లు ముగిసససరికి.. 16/3. ఇషాన్ కిషన్(12), తిలక్ వర్మ(2) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తేనే.. రాజస్థాన్ ముందు సరైన లక్ష్యాన్ని ముంబై నిర్ధేశించగలరు.

ALSO READ :- MI vs RR: రాజస్థాన్ బౌలింగ్.. కుర్ర బౌలర్‍నే నమ్ముకున్న పాండ్యా