‘నేను మనిషిగానే ఉంటాను’.. మైఖేల్ మేకింగ్ వీడియో

‘నేను మనిషిగానే ఉంటాను’.. మైఖేల్ మేకింగ్ వీడియో

సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. ఈ చిత్రం ఫిబ్రవరి 3న సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌‌లతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ వదిలారు.

ఇందులో యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. సందీప్ కిషన్ పోరాట సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇక విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నారు. ‘మన్నించేటప్పుడు దేవుడు అవుతాం మైఖేల్’ అని అంటే ‘నేను మనిషిగానే ఉంటాను మాస్టార్.. దేవుడవ్వాలనే ఆశ లేదు’ అని సందీప్ చెప్పడం మూవీపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. 

ఈ సినిమాలో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగా కష్టపడ్డాడని తెలుస్తోంది. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌ గా నటించిన ‌ఈ మూవీని నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.