60 వేల మందికి మైక్రోసాఫ్ట్ బైఅవుట్ ఆఫర్

60 వేల మందికి మైక్రోసాఫ్ట్ బైఅవుట్ ఆఫర్
  •  భారత్, అమెరికా, కెనడా, యూకేలోని ఉద్యోగులకు వర్తింపు

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలోని సుమారు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (బైఅవుట్) ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. అమెరికా, భారత్, బ్రిటన్, కెనడా దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే ఈ అవకాశం కల్పించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఈ క్రమంలోనే తన ఉద్యోగ బృందాన్ని సర్దుబాటు చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే 'వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్'ను తీసుకువచ్చినట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందనే దానిపై కూడా మైక్రోసాఫ్ట్ స్పష్టతనిచ్చింది. మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాధారణంగా ఉద్యోగుల స్థాయిలు లెవెల్ 50 నుంచి ప్రారంభమై పైకి వెళ్తాయి. నంబరు పెరిగే కొద్దీ కంపెనీలో వారి హోదా, అనుభవం, జీతం కూడా పెరుగుతుంటాయి.

అయితే, ప్రస్తుతం నాలుగు దేశాల్లోని లెవెల్ 70(ప్రాజెక్టులను లీడ్ చేసే మేనేజర్లు, సీనియర్ ఇంజనీర్లు, అనుభవజ్ఞులైన నిపుణులు), అంతకంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఇది సంస్థ మొత్తం 2,23,000 మంది ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతుకు సమానం. ఈ ఆఫర్ పూర్తిగా స్వచ్ఛందమైనదని, కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది.