
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నివాసంలో విషాదం జరిగింది. సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్(80) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. యుగంధర్ 1962 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, కేంద్రంలో ఆయన పలు కీలక పదవులు చేపట్టారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలు తెచ్చారు. లాల్ బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గానూ యుగంధర్ పని చేశారు. ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం.