
జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్బీఐ బంపర్ న్యూస్ చెప్పింది. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా 18 వేల పోస్టులను నింపేందుకు రంగం సిద్ధం చేసింది. దశాబ్ద కాలంలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు నియామకాలు ఏ బ్యాంకూ జరపలేదంటే అతిశయోక్తి కాదు. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కు గానూ అతిపెద్ద రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది.
ఎస్బీఐ బ్యాంకు నియమించుకునే ఉద్యోగాల జాబితాలో 3 వేల ఆఫీసర్లను ప్రత్యేకంగా తీసుకోనుంది. అందులో ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO), లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు (LBO) పోస్టులు కీలకంగా ఉన్నాయి. ఉద్యోగాల కోసం.. అందులో ముఖ్యంగా బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇదైతే గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పవచ్చు.
రాబోయే రిక్రూట్ మెంట్ లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఎస్బీఐ టెక్నికల్ టీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ స్ట్రాటజీలో భాగంగా 1600 మంది సిస్టమ్ ఆఫీసర్లను తీసుకోనుంది. డిజిటల్, ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్లతో ఒక పెద్ద టీమ్ ను తయారు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.
అయితే గత పదేళ్లలో ఇంత భారీగా నియామకాలను ఎస్బీఐ ఎప్పుడూ చేపట్టలేదు. ఈ నియామకాలలో 13 వేల 500 నుంచి 14 వేల వరకు క్లరికల్ స్టాఫ్, 3 వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, 16 వందల మంది సిస్టమ్ ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టీ ప్రకటించారు. ఇది బ్యాంకిగ్ సెక్టార్ లోనే అతిపెద్ద రిక్రూట్ మెంట్ కానుందని ఆయన అన్నారు.
ఇంకేంటి.. క్లరికల్ ఆప్టిట్యూడే కాకుండా.. డిజిటల్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి కూడా ఈ రిక్రూట్ మెంట్ ఓ పెద్ద వరం అని చెప్పవచ్చు. జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లు.. ఎస్బీఐ రిక్రూట్ మెంట్ ను కాస్త సీరిసయస్ గా తీసుకుని సాధన చేస్తే.. మీరు కూడా జాబ్ కొట్టేయవచ్చు.