Suzlon Stock: సుజ్లాన్ స్టాక్ ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక.. అనలిస్టుల మాట ఇదే..

Suzlon Stock: సుజ్లాన్ స్టాక్ ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక.. అనలిస్టుల మాట ఇదే..

Suzlon Energy: కొన్ని నెలల కిందటి వరకు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోని స్టాక్స్ విరామం లేకుండా ర్యాలీని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ రంగంలో కొత్త ప్రాజెక్టుల అమలుతో వచ్చిన భారీ ఆర్డర్లు భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ప్రస్తుతం ఈ రంగం షేర్లలో ట్రెండ్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కుగా పెట్టుబడికి ఆసక్తిని చూపుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. గడచిన మూడు నెలల కాలంలో సుజ్లాన్ స్టాక్ కేవలం 2 శాతం మాత్రమే లాభపడిన సంగతి తెలిసిందే. అయితే నిపుణులు ఈ కంపెనీ షేర్లపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బేరిష్ ట్రెండ్ ప్రారంభమైనట్లు చెప్పారు.

గత ఏడాది సెప్టెంబరులో కంపెనీ షేర్ల ధర తన 52 వారాల గరిష్ఠాన్ని తాకిందని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ షిట్జీ గాంధీ పేర్కొన్నారు. అయితే అక్టోబర్ నాటికి నెలరోజుల్లో 16 శాతం క్షీణతను చూసిన స్టాక్ ఆ తర్వాతి నుంచి ఫిబ్రవరి 2025 వరకు దాదాపు 30 శాతం ధరలో క్షీణతను నమోదు చేసింది. 

అయితే రానున్న కొన్ని వారాల్లో కంపెనీ స్టాక్ ధర రూ.48 నుంచి రూ.62 మధ్య స్థాయిలో కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నేడు మార్కెట్ల ముగింపు సమయంలో సుజ్లాన్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.53.80 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.73వేల 360 కోట్లుగా ఉంది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే 2 ఏళ్లలో ఇన్వెస్టర్లు 546 శాతం రాబడిని అందుకోగా.. 3 ఏళ్ల సమయంలో 519 శాతం రాబడిని పొందారు. ప్రస్తుతం స్వల్ప కాలంలో స్టాక్ ధర బేరిష్ మెుమెంటం కలిగి ఉంటుందని బ్రోకరేజ్ శాంకో నిపుణులు ధూపేష్ ధమేజా పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఈ స్టాక్ లో పెట్టుబడుల విషయంపై జాగ్రత్త వహించాలని వారు సూచిస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.