యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO BANK) జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 02.
ఖాళీలు: 173.
విభాగాలు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ 30, ట్రెజరీ ఆఫీసర్ 10, చార్టర్డ్ అకౌంటెంట్ 75, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 5, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 3, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 3, సాఫ్ట్వేర్ డెవలపర్ 15, మ్యూరెక్స్ డెవలపర్ 5, ఫినాకిల్ డెవలపర్ 5, క్లౌడ్ ఇంజినీర్ 3, ఐఏ/ ఎంఎల్ ఇంజినీర్ 2, డేటా అనలిస్ట్ 2, డేటా సైంటిస్ట్ 2, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ 3, డేటా ప్రైవసీ కంప్లైయన్స్ ఆఫీసర్ 2, డేటా అనలిస్ట్ 3, డేటా సైంటిస్ట్ 3, డేటా ఇంజినీర్ 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ / బీఈ / బి. టెక్. / ఎంసీఏ / ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ / చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ / రెండేళ్ల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 13.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.800.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 02.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు uco.bank.in వెబ్సైట్ను సందర్శించండి.
