హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేసే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ నరసింహ

 హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేసే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ నరసింహ

గరిడేపల్లి, వెలుగు: సంక్రాంతి అనంతరం ఏపీ నుంచి హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం చేసే వాహనదారులు, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ సూచించారు. పండుగ ముగిసిన నేపథ్యంలో ఒకేసారి భారీగా వాహనాలు హైదరాబాద్ వైపు కదులుతున్నందున వాహనాల మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రహదారి వెడల్పు పనులు, ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసు సూచనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. 

ఎస్పీ మాట్లాడుతూ..వాహనదారులు రద్దీని గమనిస్తూ నిదానంగా నడపాలని ఓ క్రమపద్ధతిలో ప్రయాణించాలని సూచించారు. సుదీర్ఘ ప్రయాణంలో కొంత విరామం తీసుకుని ముందుకు సాగాలని నిద్రమత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందవచ్చని సూచించారు.